NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంచార చికిత్స కార్యక్రమంలో ఫ్లోరోసిస్ పై అవగాహన 

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: శుక్ర వారం   ఉదయం 11 గంటలకు  టివి 9కాలనిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమంలో ఫ్లోరోసిస్ పై అవగాహన  కార్యక్రమము నిర్వహించినారు. ఈ సందర్భంగా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్  మాట్లాడుతూ  ఫ్లోరోసిస్ వ్యాధిపై మహిళలకు   అవగాహన  కలిగి ఉండాలని తెలిపారు,    పొగాకు ఉత్పత్తులైన బీడీ,చుట్టా,సిగరెట్,జరదా,తంబాకు,పాన్ మసాలా,గుట్ఖా వంటివి ఉపయోగించడము వలన ఫ్లోరోసిస్ సంబంధిత  ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. , అధిక స్థాయిలో  ఫ్లోరైడ్ కలిగిన ఆహార పదార్థాలు మంచి నీరు తీసుకున్నందువలన ఫ్లోరోసిస్ వ్యాధికి గురియావుతారు, దీని వలన వికారము,వాంతులు,ఆకలి మందగించడము,కడుపునొప్పి,కడుపుఉబ్బరము ఉండడము,దంతాలు రంగు మారడము,తరచూ మూత్రము రావడము,అధికంగా దాహము వేయడము,కండరాలు,కీళ్ల నొప్పులు, ఎక్కువగా నడవలేక పోవడము ఇలాంటి లక్షణాలు వస్తాయని తెలిపారు. ఫ్లోరోసిస్ కు గురి అయినవారు తాజా ఆకు కూరలు, పాలపదార్థాలు తాజా పండ్లు, విటమిన్ –సి, ఉన్న ఆహార పదార్థాలు( ద్రాక్ష,ఊసిరి,నిమ్మకాయలు),  తప్పకుండ తీసుకోవాలని తెలిపారు. యెక్కువగా మరగకాచిన టీ ,కాఫీ  మరియు డికాషన్ తీసుకోవడము వలన కూడా ఫ్లోరోసిస్ వ్యాధికి గురి అవుతారని తెలిపారు. మనం తీసుకున్న ఆహారం,నీరు కారణంగా శరీరంలో ఫ్లోరోసిస్ ప్రవేశిస్తుందని తెలిపారు, మొదట పళ్ళు ద్వారా బయటపడే ఈ వ్యాధి ఎముకలలో వ్యాపిస్తుంది. ఎముకల మీద చూపే ప్రభావం ఫలితంగా శరీరంగాలు ,ముఖ్యంగా కాళ్ళు చేతులు దారుణమైన వికృత రూపును తెచ్చుకుంటాయని తెలిపారు. కొందరి పళ్ళు అరిగి పోవడం ,గారలు పట్టడం జరుగుతుంది తెలిపారు.ఈ కార్యక్రమంలొ వైద్యులు నందిని, క్షేత్ర స్థాయి పర్యవేక్షకులు ఎస్తేర్ రాణి,సామాజిక ఆరోగ్య అధికారులు అనిత, మహేశ్వరి, ఆశా కార్యకర్తలు జమృత్ బి, భారతి మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *