హెల్మెట్ వాడకంపై అవగాహన…
1 min read
కర్నూల్ తాలూకా సిఐ తేజా మూర్తి.
కర్నూలు, న్యూస్ నేడు: వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని కర్నూల్ తాలూకా సిఐ తేజా మూర్తి అన్నారు. కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఆయన వాహనదారులకు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ తాలూకా సిఐ తో పాటు ఎస్ఐ రామాంజనేయులు ఉన్నారు.

