వరల్డ్ టిబి డే సందర్భంగా అవగాహన కార్యక్రమం
1 min read

మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 24న జరుపుకునే వరల్డ్ టిబి డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో క్షయవ్యాధి (టిబి)పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో టిబి వ్యాధి లక్షణాలు, నివారణ మరియు చికిత్సపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పుల్మనాలజిస్ట్ Dr K Vinod Achari మరియు కన్సల్టెంట్ పుల్మనాలజిస్ట్ Dr Suvarna Lakshmi Kalli పాల్గొని టిబి వ్యాధి గురించి వివరించారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. టిబి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, సరైన సమయంలో గుర్తించి పూర్తి స్థాయి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు.ఈ సంవత్సరం థీమ్ “Yes! We Can End TB: Led by Countries, Powered by People” ఆధారంగా టిబి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వైద్యులు పేర్కొన్నారు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనల మేరకు చికిత్సను మధ్యలో ఆపకుండా కొనసాగించడం ద్వారా టిబిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy మాట్లాడుతూ, “టిబి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో కీలకం. అవగాహన పెంచడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలుగుతాం. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది” అని తెలిపారు.

