NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“రహదారి భద్రత నియమాల పై డ్రైవర్ లకు అవగాహన సదస్సు “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు          : రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 24.10.2026 న  స్థానిక బళ్లారి చౌరస్తా నందు గల ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్  కాలేజి, కర్నూలు నందు రహదారి భద్రతా నియమాలపై  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్,చైర్మన్ వెంకట హరినాథ్ లు రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.   జడ్జి లీలా వెంకట శేషాద్రి మాట్లాడతూ  సమాజంలో  ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించాలని డ్రైవర్లను, ట్రయినింగ్ డ్రైవర్స్ ను కోరారు. సీట్ బెల్టు ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగిన ప్రాణాలను రక్షించుకోవచ్చు అని తెలిపారు. ఓవర్ లోడు వేసుకుని వాహనం నడపరాదని తెలిపారు. ప్రతి సంవత్సరం రహదారి ప్రమాదంలో అనేకమంది ప్రాణాలను కోల్పోతున్నారని రహదారి నియమాలను పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు వాహనాలు నడపరాదని తెలిపారు.అట్టి మైనర్లు వాహనం నడుపుతూ పట్టుపడితే ఆ వాహన యజమానులకు లేదా అతని తల్లిదండ్రులకు Rs. 25, 000/- వేల రూపాయల జరిమానాలతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు.  రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ భరత్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము రహవీర్  స్కీం ప్రవేశపెట్టిందని ఈ స్కీం లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేసి దగ్గర లో గల హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి తగిన వైద్య సహాయం అందించి  వారి ప్రాణాలను కాపాడిన వారికీ గాయపడిన వారిని కాపాడి నందుకు ప్రోత్సాహంగా 25 వేల రూపాయలు ఈ స్కీం ద్వారా అందిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్ టి సి రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు,  రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ భరత్ సింగ్,ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మరియు టూ టౌన్ సిఐ మధు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సులోచన, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్  కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్, ఏపీఎస్ఆర్టీసీ కర్నూల్ డిపో మేనేజర్ సుధారాణి, ఏపీఎస్ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ రాఘవరెడ్డి, డ్రైవర్స్, ట్రయినింగ్ డ్రైవర్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *