NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వొకేషనల్ కళాశాలలో  బాల గంగాధర తిలక్  జయంతి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల లో బుధవారం నాడు   ప్రిన్సిపాల్ డాక్టర్ యస్.    నాగస్వామి నాయక్  ఆధ్వర్యంలో బాల గంగాధర తిలక్  జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ కొట్టె చెన్నయ్య మరియు నేషనల్ హుమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్  ఇండియా జనరల్ సెక్రటరీ రాయపాటి     శ్రీనివాస్   మరియు కళాశాల లెక్చరర్స్ ఈ సందర్భంగా  బాల గంగాధర తిలక్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనమైన  నివాళులర్పించారు.  భారత దేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తాను స్థాపించిన “కేసరి” పత్రిక ద్వారా ప్రజలలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ని   కలిగించి , ప్రజాభిమానాన్ని పొంది ” లోకమాన్య ” తిలక్ గా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి బాల గంగాధర తిలక్ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ముఖ్య అతిథి కొట్టె చెన్నయ్య ప్రసంగిస్తూ  తిలక్ పోరాట ప్రతిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని జీవిత లక్ష్యం నెరవేరుతుంది   తెలిపారు.   కార్యక్రమం లో చంద్రశేఖర ఆజాద్ జయంతి పురస్కరించుకుని వారి సేవలను కొనియాడారు. నేషనల్ హుమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్  ఇండియా సంస్థ జనరల్ సెక్రటరీ రాయపాటి శ్రీనివాస్  చేతుల మీదుగా రవీంద్ర నాథ్ ఠాగూర్ నేషనల్ అవార్డు ఫర్ ఎడ్యుకేషనల్ లీడర్ షిప్ అవార్డు ను  ప్రిన్సిపల్  డాక్టర్ యస్ నాగస్వామి నాయక్ అందుకున్నారు.  కార్యక్రమం లో    కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్, మల్లికార్జున, కృష్ణ మోహన్,  సోమేష్, ఉల్గోజి రావు, చిన్న మల్లేశ్వరుడు  మరియు విద్యార్థినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

About Author