ఏప్రిల్ నుండి ప్లాస్టిక్ వాడకం నిషేధం…
1 min readకడప నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న
పల్లెవెలుగు వెబ్, కడప: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని.. నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ కమిషనర్ లవన్న ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో స్పందన హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ వారి తీర్మానం నెం. 240 మరియు జిల్లా గెజిట్ నెంబర్ 51/ 2018 ను అనుసరించి కడప నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్లాస్టిక్ కొనడం.. అమ్మడం గాని వినియోగించడం గాని చేయరాదని, నగర ప్రజలకు ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగ్స్, గుడ్డతో కుట్టిన బ్యాగులు మరియు పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు మరియు పేపర్ బ్యాగులు వాడాలని కోరారు. సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది 01-04-2021 నుండి పర్యవేక్షిస్తారని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.