బ్యాంకు ఉద్యోగులకు ఆట విడుపు…
1 min read
కర్నూలులో ఘనంగా ఏఐబిఈఏ 80వ వార్షికోత్సవం
పోటీలు ప్రారంభించిన విజయ బ్యాంకు పూర్వపు అధ్యక్షులు ఈశ్వరప్ప
కర్నూలు, న్యూస్ నేడు : బ్యాంకింగ్ రంగంలో ని అతిపెద్ద ట్రేడ్ యూనియన్ AIBEA 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘము (AlBEA) ఆధ్వర్యంలో ఉద్యోగుల కు మరియు వారి పిల్లలకు ఆటల ఫోటీలు నిర్వహించారు. కర్నూలు క్లబ్ లో AIBEA జిల్లా మొదటి సెక్రటరీ మాక్బుల్ మరియు విజయ బ్యాంకు పూర్వపు అధ్యక్షులు ఈశ్వరప్ప పోటీలను ప్రారంభించారు. క్యారమ్స్, , చెస్, షటిల్ బ్యాట్మెంటన్, లెమన్ అండ్ స్పున్, మ్యూజికల్ చేర్స్, డాన్స్, పాటల పోటీలు, టగ్గాఫర్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో దాదాపుగా 60 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ, అజయ్, వాసుదేవ రెడ్డి,మహిళా నాయకురాలు పద్మావతి నిర్వహించారు.
