ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అదించాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల వైద్యం కొరకు ఎక్కడ కూడా వెనుకాడకుండా కోట్లాది రూపాయలు వెచ్చించడంతోపాటు, ఆసుపత్రుల్లో సామాగ్రి తో పాటు, అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, గురువారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో, ప్రజల ముంగిటకే వెళ్లి వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 8 గ్రామ సచివాలయాల పరిధిలో గల 3 వేల 6 వందల మందికి పైగా ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు, మెరుగైన వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా పంపించడం జరిగిందన్నారు, ఇందుకు సంబంధించి చెన్నూరు వైద్య సిబ్బంది అంతా కూడా సమయపాలన పాటించి, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఇలాంటి సమావేశాలు జరిగే సమయంలో, హాస్పిటల్స్ సిబ్బంది అంతా కూడా తప్పనిసరిగా హాజరైతే బాగుంటుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ సతీష్, డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ సాగర్ కుమారి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.