NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భగవాన్​ శ్రీ బాలసాయిబాబా ఆశీర్వాదం …అందరికీ ఉండాలి

1 min read

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాలసాయిబాబా ట్రస్ట్‌ చైర్మన్​ రామారావు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: భగవాన్​ శ్రీ బాలసాయిబాబా ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, భగవాన్​ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు. కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సేవా ఆశ్రమంలో గురువారం పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్ ను  ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ చైర్మన్​ రామారావుమాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో మీడియా రంగం పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… పరిష్కరించడందిశగా వార్తలు రాయాలని కోరారు. మీడియా రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్న ట్రస్ట్​ చైర్మన్​ రామారావు…భగవాన్​ శ్రీ బాలసాయిబాబా వారి 62వ జన్మదినం వేడుకలు మరియు ప్రపంచ శాంతి సదస్సు గురించి వివరించారు. పేదలకు సేవ చేయడంలో ముందుంటామన్నారు. దివ్యాంగులు, మహిళలు, చిరువ్యాపారులకు  శ్రీబాలసాయిబాబా వారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా ట్రైసైకిళ్లు, కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు తదితరవి పేదలకు ఉచితంగా అందజేస్తామన్నారు.  ఈ నెల 14న జరిగే  బాబా జన్మదిన వేడుకలకు ప్రతిఒక్కరూ రావాలని ఈ సందర్భంగా ట్రస్ట్​చైర్మన్​ టి. రామారావు కోరారు.

About Author