వినాయక చవితి సందర్భంగా ఎండి హళ్లిలో రక్తదాన శిబిరం
1 min read
స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 30 మంది
రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలి: ఉరుకుంద ఈరన్న స్వామి
ఆలయ పాలక మండలి సభ్యులు సుధాకర్
హొళగుంద న్యూస్ నేడు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హొళగుంద మండలంలోని ఎండి హళ్లి గ్రామంలో ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ పాలక మండలి సభ్యులు సుధాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండి హళ్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు యువకులు, నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. సుమారు 30 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.వినాయక చవితి వంటి పర్వదినాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎండి హళ్లి టీడీపీ నాయకులు ఈరన్న, నాగరాజు, పెద్దగోనేహాల్ టీడీపీ నాయకులు వీర నాగప్ప, వెంకట్రాముడు, రాము, రవి, ఇంగలదాహాల్ టీడీపీ నాయకులు హనుమంతు, జనసేన నాయకులు సుభాన్, ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లికార్జున, జనసేన సంఘం నాయకుడు విరుపాక్షి స్వామి, ఆర్‌ఎంపీ మంజునాథ్, మహేష్, గోపీ చారిటబుల్ ట్రస్ట్ ఆదోని ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



