ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ పునర్నిర్మాణ ఎన్నికలు
1 min read
సెప్టెంబర్ 29న పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి: MEOలు
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పునర్నిర్మాణ ఎన్నికలు ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారులు–1&2 తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2026 సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం ఎన్నికైన సభ్యుల ద్వారా చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడంతో పాటు తొలి ఎస్ఎంసీ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఎంఈఓ లు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా మరియు సజావుగా ఎన్నికలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.– మండల విద్యాశాఖాధికారులు–1&2, హొళగుంద మండలం.


