టీడీపీ సీనియర్ నాయకుడు బంగి సంజన్న మృతికి ఎమ్మెల్యే కోట్ల సంతాపం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలం అలేబాద్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బంగి సంజన్న మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంజన్న నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, సంజన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సింగల్ విండో అధ్యక్షుడు సీమా సుధాకర్ రెడ్డి,అలేబాద్ పరమేష్ మరియు తేదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు.


