క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే చికిత్స లేకుండా నివారించవచ్చు
1 min readఆశ్రo ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ వైద్య శిబిరం
శిబిరంలో 122 మందికి ఉచిత వైద్య పరీక్షలు
పాల్గొన్న వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు,సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: కేన్సర్ వ్యాధి ప్రారంభ దశలో గుర్తించ గలిగితే చికిత్స లేకుండా నివారించుకోవచ్చని ఆశ్రం కేన్సర్ కేర్ సెంటర్ తో బాటు ఆశ్రo హాస్పిటల్ కేన్సర్ వైద్య నిపుణులు తెలియజేసారు,ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళ వారం ఆశ్రo కేన్సర్ కేర్ ఆశ్రo హాస్పిటల్ లో ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు,ఈ శిబిరం లో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు,కేన్సర్ నిర్దారణ కు చేసే పాప్ స్మియర్,మోమోగ్రపీ,అల్ట్రా సౌండ్,ఎక్స్ రే వంటి పరీక్ష లు అవసరమైన వారికివైద్యుల సూచనల మేరకు ఉచితంగా నిర్వహించారు,ఈ సందర్భం గా ఆశ్రo కేన్సర్ కేర్ వైద్యు నిపుణులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేన్సర్ వ్యాధి పట్ల అవగాహనపెంచుకుని చేతులు కాలిపోయిన తరువాత ఆకులు పట్టు కున్న ట్టు గా కాకుండా కేన్సర్ వ్యాధి కి చికిత్స కన్నా నివారణే ఉత్తమమైన మార్గమని వైద్యులు నిర్వహించిన ఈ వైద్యసిబిరానికి మంచి స్పందన లభించింది,ఈ శిబిరం లో నోటి కేన్సర్,థైరాయిడ్,రొమ్ము కేన్సర్,ఊపిరితిత్తుల కేన్సర్,పేగు కేన్సర్,గర్భాశయ ముఖ ద్వార కేన్సర్,కిడ్నీ కేన్సర్,ప్రొస్టేట్ కేన్సర్,అండాశయ,గర్భాశయ,వంటి మర్మాoగ అవయవాలకు సంబంధించిన రకరకాల శరీర భాగాలకు సోకే కేన్సర్ వ్యాదులను వివరించి అటువంటి లక్షణా లు ఉన్నట్టుఅనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యులు సలహాలు అందించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు,ఈ వైద్య శిభిరం లో ఏలూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లవల్లి చలపతిరావు వారి కార్యవర్గ సభ్యులు విశేష సేవలు అందించారు,ఆశ్ర oకేన్సర్ కేర్ సెంటర్ ద్వారా ప్రజలలో ప్రభలే ప్రాణాంతక వ్యాధి కేన్సర్ వ్యాదుల పట్ల నిర్వహించే వైద్య శిబిరాల లోఏలూరు లైన్స్ క్లబ్ ను భాగస్వాములను చేయడం ట్రప్తినిచ్చిందని మళ్లవల్లి చలపతిరావు అన్నారు,ఈ శిబిరం లో 122 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన వారికి వివిధ విభాగాల ద్వారా ఉచిత చికిత్సలు నిర్వహించారు,ఈ వైద్య శిబిరం లో ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శైలజ,డాక్టర్ డీ ,సిందూర,డాక్టర్ కన్మణి తో బాటు వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు,ఈ వైద్య శిభిరం నిర్వహణ ఆశ్రoఈఓ, డాక్టర్ కె హనుమంతరావు పర్యవేక్షణలో జరిగింది.