జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డే కార్యక్రమములో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్: శాంతి కళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ మధ్యం,ధూమపానము,పొగాకు ఉత్పత్తులతో పాటు జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశము ఉందని, స్త్రీలు ముఖ్యంగా రొమ్ము,గర్భాశయపు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవడము ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు. ఎన్‌సిడి 3.0 లో భాగంగా 18 సంవత్సరములు దాటీనా వారందరికి రొమ్ము,నోటి,గర్భాశయపు ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పలు పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేయాలని తెలిపారు,అతిగాబరువు తగ్గడము,జ్వరము,అలసట,శరీరంలో మార్పులు,అసాధారణ రక్త స్రావము, మలమూత్ర విసర్జనలో మార్పులు,మాననీ పుండ్లు,ఋతుక్రమములో మార్పులు,రొమ్ములో గడ్డలు ,జీర్ణ సంబంధమయిన సమస్యలు,మింగుటలో ఇబ్బంది ,పుట్టుమచ్చలలో మార్పులు,బొంగురు గొంతు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారికి తెలపాలని . ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చునని తాలిపారు.. క్యాన్సర్ వ్యాధికి ముందస్తు పరీక్షలు చేయించుకొని గుర్తిస్తే వ్యాధి నయమవుతుందని కావున ప్రజలందరికీ ఈ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని వైద్య సిబ్బంది కి సూచించినారు.మాతా శిశు సంరక్షణ కోసం ఆరోగ్య సూచనలు,సలహాలను ఫోన్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కిల్కారి సేవలను ప్రవేశ పెట్టిందనితెలిపారు.గర్భవతిని 12 వరాలలోపునమోదుచేసివారికిఇవ్వవలసినసేవలు సకాలంలోపొందేలా చూడాలని,గర్భిణీలు , బాలింతలుతీసుకోవలసినజాగ్రత్తలు,పాటించవలసిన నియమాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు,క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్: శాంతి కళ DPMO డాక్టర్.ఉమాఎన్‌సిడి నోడల్ ఆఫీసర్ డాక్టర్.శైలేశ్ కుమార్ ,డాక్టర్.సాత్విక కలిసి గొడపత్రాలను ఆవిష్కరించినారు.ఈ కార్యక్రమములో కార్పొరేటర్ షేక్ నీలోఫర్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ , ఆర్‌కేఎస్‌కే కన్సల్టెంట్ మల్లికార్జున ,వీరన్న,సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు ,ఆశా కార్యకర్తలు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.