ఆలూరు ప్రజలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారు
1 min read
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గ ప్రజలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.2018 సంవత్సరంలో వేదవతి ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, నేటి వరకు ఆ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదన్నారు. అలాగే నగరడోణ ప్రాజెక్టు గురించి కూడా ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోందని ఆరోపించారు.చంద్రబాబు తనయుడు లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆస్పరి ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్వయంగా ప్రస్తావించారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎమ్మెల్యే స్థానాన్ని ఇవ్వలేదని, అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలపై కపట ప్రేమ చూపిస్తూ హామీలు ఇస్తున్నారని ఎస్.కె. గిరి అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వేదవతి, నగరడోణ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


