ప్రభుత్వం ప్రతి జిల్లాలో నిర్వహించే సెమీ క్రిస్మస్ కి క్రైస్తవ నాయకులు పాల్గొనాలి
1 min read
గుంటూరు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు, ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి, గుంటూరు, జిల్లాలోని చేబ్రోలులో ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో సెమీ క్రిస్మస్ (హై టీ) జరపడంతో పాటు, ప్రతి జిల్లాలో డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్ వారు నిర్వహిస్తున్నారు, దీనికి సాధారణంగా జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా వస్తారు. ముఖ్యమంత్రి సెమీ క్రిస్మస్ బడ్జెట్ను కూడా ఇంతకుముందు కంటే రెట్టింపు చేశారు, దీనికి జిల్లాలో ఉన్న క్రైస్తవ నాయకులు అందరూ పాల్గొని చర్చి సమస్యలు, బరియల్ గ్రౌండ్స్ వంటి సమస్యలు ఉంటే కూడా జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించవచ్చు అని ప్రొఫెసర్ జోసెఫ్ సూచించారు.

