అభివృద్ధి, సంక్షేమం చేపట్టడమే సీఎం చంద్రబాబు ధ్యేయం
1 min read

స్పష్టం చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ. శ్యాం కుమార్
పత్తికొండ, న్యూస్ నేడు: గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. బెంగళూరు, మంత్రాలయం రహదారికి(గుత్తి ఎర్రగుడి నుండి జొన్నగిరి వరకు) రూ 5 కోట్ల తో మరమ్మతు పనులు చేపట్టేందుకు జి. ఎర్రగుడి గ్రామం ప్రధాన రహదారి వద్ద ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో, సంక్షేమ పథకాలు అంతే ప్రాధాన్యంగా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఈఈ పద్మనాభ రెడ్డి, డిఈఈ శివ రుద్ర కుమార్, ఏఈ సునీల్ కుమార్, టిడిపి నాయకులు తుగ్గలి నాగేంద్ర, మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి, బీసీ వెంకటస్వామి, చంద్రశేఖర్ యాదవ్, మిద్దె రవి కుమార్, యాదవ్, మిద్దె వెంకటేష్ యాదవ్, అప్పా వేణుగోపాల్, శ్రీనివాసులు గౌడు, తిరుపాల్ నాయుడు, వెంకట్రామ చౌదరి, సోమశేఖర్ గౌడ్, , జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు, కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

