యువతకు ఉపాధి.. సీఎం చంద్రబాబుతోనే సాధ్యం..
1 min read
టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి
మంత్రాలయం: రాష్ట్రంలో యువతకు ఉద్యోగా, ఉపాధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రాలయం టిడిపి కార్యాలయంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేష్ స్వామి అధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాద్యాయ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి , బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, మాధవరం క్రిష్ణా మోహన్ రెడ్డి,తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, తిక్కస్వామి గౌడ్, వట్టేప్ప గారి నరసింహులు, చిన్న భీమన్న, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ సున్నం గురురాజ, ఈరన్న, సుజ్ఞాన్నాం, అండే హనుమంతు, విజయ రవి, యోబు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.