NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు.. మహిళలను మోసం చేసిన ప్రభుత్వం

1 min read

: కురువ శశికళ కృష్ణమోహన్

ఉన్నవి ఊడపీకేసి.. రెండేళ్లలో నిలువుదోపిడీ చేశారు

వైఎస్సార్‌సీపీ హయాంలోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం

33 శాతం రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారు

చీకటి సామ్రాజ్యాధినేత ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన చూపిస్తోంది

“ఆలూరు న్యూస్ నేడు: చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” అనే అంశంపై తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా విభాగ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, ఆలూరు నియోజకవర్గ నాయకురాలు కురువ శశికళ కృష్ణమోహన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల సాధికారత కోసం అమలు చేసిన పథకాలను కూడా రద్దు చేసి, మహిళల సంక్షేమాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వాటి గురించి కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలు పూర్తిగా మోసపూరితమైనవని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.రెండేళ్ల పాలనలో ప్రజలపై భారాలు మోపడం, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రభుత్వం చేసిన పని అని ఆమె ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రచారాలతోనే కాలం గడుపుతోందని మండిపడ్డారు.”చీకటి సామ్రాజ్యాధినేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన స్పష్టంగా చూపిస్తోంది. ప్రజలు ఈ మోసపూరిత పాలనను గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారు” అని కురువ శశికళ కృష్ణమోహన్ అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా విభాగ నాయకులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *