అక్రమ మద్యం కార్యకలాపాలను ఆపిన వారికి కలెక్టర్ లోన్ చెక్కులను పంపిణీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించిన తర్వాత అక్రమ మద్యం కార్యకలాపాలను ఆపిన వారికి తగిన ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించడం ద్వారా దానిని నిలబెట్టుకోవడానికి, కర్నూలు నగరంలోని బంగారుపేటలో నాటు సారా తయారీ వంటి అక్రమ కార్యకలాపాలను ఆపిన 10 మంది లబ్ధిదారులకు కలెక్టర్ కర్నూలు నేడు 20 లక్షల విలువైన 5 ఆటోలు మరియు 5 మందికి లోన్ చెక్కులను పంపిణీ చేశారు… ఈ కార్యక్రమంలో శ్రీదేవి డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కర్నూలు, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు కర్నూలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు రాజశేఖర్ గౌడ్ రామకృష్ణారెడ్డి కర్నూలు మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కర్నూలు, చంద్రహాస్ ఎస్ఐలు రెహానా, వెంకటరాజు, నవీన్ బాబు ప్రాజెక్ట్ డైరెక్టర్ పట్టణ పేదరిక నిర్మూలన ఉపాధి సంస్థ శ్రీనివాసులు మరియు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి రెడ్డి మరియు ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం జరిగినది. మొత్తం 20 లక్షల రూపాయలు రుణాలు ఇండియన్ బ్యాంక్ వారు మంజూరు చేయడం జరిగినది.కావున బంగారుపేట వాసులను ఉద్దేశించి నాటుసారా తయారీ పూర్తిగా మానివేసి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు ఆలోచించి తదనగుణంగా శిక్షణను పొందుటకు సహాయ సహకారాలు అందించుటకు అటు ఎక్సైజ్ శాఖ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంసిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ మీకు ప్రావీణ్యం ఉన్న రంగాన్ని ఎంచుకొని మాకు తదుపరి జాబితాను ఇచ్చినట్లయితే వారికి కూడా సంబంధిత స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేయుటకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేయడమైనది.

