కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడ
1 min read
జైల్ భరో సందర్బంగా 35 మంది అరెస్ట్
సొంత పూచికత్తు పై విడుదల
మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి :సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త జైల్ భరో కార్యక్రమం లో భాగంగా మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు, బికెయంయు, ఎఐటియుసి, సి ఐ టియు ల ఆధ్వర్యంలో సోమవారం పికెటింగ్ నిర్వ హించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ వద్ద పికెటింగ్ చేస్తున్న రైతు సంఘం రాష్ట్ర నాయకులు డా.టి. జనార్దన్, బికెయం యు జిల్లా అధ్యక్షులు తోపు కృష్ణప్ప, ఎఐటియు సి నాయకులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరి శర్మ, అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి గంగాదేవి తోపాటు 35 మంది కార్మిక రైతు సంఘ నేతలను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కార్మిక, రైతు వ్యతిరేక విధానాల ను కొనసాగిస్తూ గతంలో సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేయడం, కనీస వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ కార్యదర్శి హరి, బి కెయంయు నేత మునిరత్నం నాయుడు,గజపతి,,తిరుమల,దేవా, రాధా, సిఐటియు నాయకులు గంగా దేవి, మధురవాణి, జ్యోతి , విజయ లు పాల్గొన్నారు.అనంతరం వన్ టౌన్ పోలీసులు సొంత పూచికత్తు మీద అరెస్టయిన కార్మిక, రైతు నేతలను విడుదల చేశారు.


