NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘కొణిదేల’అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రండి

1 min read

డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే గిత్త..

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామంలోఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రావాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఉప ముఖ్యమంత్రి కోరారు. శనివారం అమరావతిఅసెంబ్లీ చాంబర్ లో డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కలిశారు.గ్రామంలో డిప్యూటీ సీఎం సొంత నిధులు 50 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం పూర్తయింది”పల్లె పండుగ 1.0’లో రూ.20 లక్షలకు పైగా వెచ్చించి 3 రోడ్లు పల్లె పండుగ 2.0’లో 45 లక్షలతో 7 సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు.జిల్లా పరిషత్ పాఠశాలనుండి లక్ష్మాపురం వరకు 5 కిమీ మేర బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్లు,  పంచాయతీ రాజ్ నిధులు రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు 45 లక్షలు మంజూరు చేయాలని విన్నవించారు.నియోజకవర్గంలో చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గుర‌య్యాయి.గత ప్రభుత్వంరోడ్ల పనులు చేయ కపోవడంతో గ్రామాల్లో రోడ్లు చాలా అద్వాన్న స్థితుల్లో ఉన్నాయి.పిఆర్ నుండి కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా కొణిదేల గ్రామాన్ని సందర్శిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే కలిసి మల్యాల, ముచ్చుమర్రి బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.

About Author