కామెడీ ఎంటర్ టైనర్ మజాకా.. ఈ ఆదివారం మీ జీ తెలుగులో!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాతో వచ్చేస్తోంది. సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు సాగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మజాకా’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మజాకా’ ఈ ఆదివారం(ఏప్రిల్ 20) సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!ఈ సినిమా కథ విశాఖపట్నంలో సాధారణ జీవితాన్ని గడిపే కృష్ణ (సందీప్ కిషన్), అతని తండ్రి వెంకట రమణ (రావు రమేష్) చుట్టూ తిరుగుతుంది. కృష్ణకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో వెంకట రమణ మొదట తాను వివాహం చేసుకుని తర్వాత కృష్ణకు వధువును చూడాలనుకుంటాడు. కృష్ణకు మీరా (రీతూ వర్మ) పరిచయమవుతుంది, అదే సమయంలో వెంకట రమణకు యశోద (అన్షు సాగర్) కలుస్తుంది. వారి జీవితాలు ఎలా మారతాయి, మీరా మరియు యశోద ఎందుకు కలవాల్సి వస్తుంది, వారి వివాహాలు ఎలా జరుగుతాయనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే మజాకా సినిమా తప్పకుండా చూడాల్సిందే!మజాకా కామెడీ ఎంటర్‌టైనర్గా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలోని హృదయాలను హత్తుకునే సన్నివేశాలు, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు సాగర్ ప్రధాన పాత్రలు పోషించగా మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. కడుపుబ్బా నవ్వించే మజాకా సినిమాని మీరూ మిస్ కాకుండా చూసేయండి!