NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్

1 min read

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా పన్నుల వ్యవస్థను మరింత సులభతరంగా, పారదర్శకంగా పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం పలు రకాల వస్తువులు మరియు సేవలపై పన్ను రేట్లను పట్టికలో పేర్కొన్న విధంగా తగ్గించడం అయినదని ఈ అవకాశం వినియోగదారులు సద్వినియోగం చేసుకొని లబ్ది పొందగలరని వివిధ రకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కమర్షియల్ టాక్స్ కార్యాలయ సిబ్బంది జి.ఇందిరమ్మ ఏఈఓ, కె.మౌనిక ఈటిఏ,తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ “సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్” జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు.

About Author