NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

1 min read

ఆలూరు తెదేపా ఇన్చార్జి వీరభద్ర గౌడ్…..

కడ్లేమాగి గ్రామ బి టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ తీ…..

హొళగుంద, న్యూస్​ నేడు:   కూటమి ప్రభుత్వ పాలనలోనే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. మంగళవారం హోళగుంద మండల మజరా గ్రామమైన కడ్లేమాగి గ్రామ బి టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ 3.89 కిలోమీటర్ల మేర  3.60 కోట్ల నిధులతో కడ్లేమాగి గ్రామ బి టి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని, ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధిని జోడెద్దుల బండిగా పాలన సాగిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి మండల పరిధిలోని హోన్నూర్ క్యాంప్ రోడ్డు,ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లను 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్లను 6000 రూపాయలకు పెంచి ప్రతినెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నుంచే మే నెలలో తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు అందజేస్తామని అసెంబ్లీలో విద్యాశాఖామంత్రి  నారా లోకేష్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు  అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్ లకు, మౌజన్ లకు గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణ కొరకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని, కచ్చితంగా రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఢణాపురం – హోళగుంద రోడ్డు నిర్మాణం చేపట్టండి అని తెదేపా కార్యకర్తలు,ప్రజలు ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ ను కోరగా గత కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయక అర్థాంతరంగా ఆపేశారని, త్వరలోనే ఢణాపురం – హోళగుంద రోడ్డు నిర్మాణానికి రీ టెండర్ నిర్వహించి మే నెల నుండి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.హోళగుంద – చిన్నహ్యట 5 కి. మీ.రోడ్డు గుంతలు లేకుండా పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. హోళగుంద మండల కేంద్రములో మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ను కోరారు. కచ్చితంగా హోళగుంద మండల కేంద్రములో మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని వీరభద్ర గౌడ్ హామీ ఇచ్చారు.ఆలూరు నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలో సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్, మిక్కిలినేని శ్రీనివాసులు,వేణుగోపాల్, విజయ్, తెలుగు యువత జిల్లా కార్యదర్శి సురేంద్ర నాయుడు,అబ్దుల్ సుభాన్, మోయిన్, బాబు సాబ్, రైస్ మిల్  మురళీధర్, ఊలూరు కాడప్ప, తోక వెంకటేష్, బాగోడి రాము, గజ్జెల్లి గిరిమల్ల,మహేష్, జమాపుర బసవ, పుట్టప్ప,నజీర్ సాబ్, డి ఎస్ బాషా, వన్నూరప్ప,వెంకటరాముడు,బిజెపి నాయకులు చిదానంద, ఏఈఎన్ ప్రసాద్, మహేష్,కళింగ, జనసేన కన్వీనర్ అశోక్, కో కన్వీనర్ వరాల వీరేష్,వెంకటేష్, ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్,శేషప్ప కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *