ఆయా కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ…
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: జాతీయ, రాష్త్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కర్నూలు, ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2025 March, 08 రెండవ శనివారము న కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ మరియు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ జి. కబర్ధి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలియజేశారుఈ అవకాశమును కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని, తమ తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరుచున్నాము.