న్యూరో అత్యవసర పరిస్థితులపై ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సదస్సు
1 min read
సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమి) సహకారంతో నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 25, 2025: “ప్రాణాంతక న్యూరో అత్యవసర పరిస్థితులను వేగంగా గుర్తించడం, వాటి చికిత్స” అనే అంశంపై సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమి) సహకారంతో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎంకాన్ 2025 సదస్సును శనివారం విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ ఎమర్జెన్సీ ఫిజిషియన్లు, న్యూరాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, ఇతర విభాగాల వైద్యనిపుణులందరినీ ఒక చోటుకు చేర్చి, న్యూరో అత్యవసర కేసుల చికిత్సలో కొత్త టెక్నాలజీలు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్లపై రోజంతా చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో కేసుల వారీగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా న్యూరోసర్జరీ కేసుల్లో చాలావరకు అత్యవసరంగా చికిత్సలు చేయాల్సినవి ఉంటాయని, అలాంటి సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఇందులో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి..
ఎమర్జెన్సీ విభాగంలో తక్షణం న్యూరోకేసులపై అంచనా,ఎమర్జెన్సీ విభాగంలో స్ట్రోక్ కేసుల్లో సమయమే కీలకం,తీవ్రమైన న్యూరోమస్క్యులర్, వెన్నెముక అత్యవసర పరిస్థితులు, కోమా, మానసిక పరిస్థితిలో మార్పులు- ఈడీ ఆల్గరిథమ్, పిల్లల్లో న్యూరో అత్యవసర పరిస్థితులు, న్యూరో ఇమేజింగ్, న్యూరో రీహాబిలిటేషన్‌లో అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల్లో మెదడుకు గాయాలు (టీబీఐ), మెదడులో ఒత్తిడి పెరిగితే చికిత్స,ద్వారా ప్రతి నిమిషాన్నీ విలువైనదిగా భావించాలన్న విషయాన్ని ఈ సదస్సులో ప్రధానంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథం పైడిపెద్దిగారి కూడా పాల్గొని ప్రత్యేకంగా ప్రసంగించారు. ఇంకా.. డాక్టర్ వై.మురళీకృష్ణ, డాక్టర్ నీలోఫర్ అలీ, డాక్టర్ వివేక్ పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.

