పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్ లు..
1 min read– విద్యార్ధి దశ నుండే వినియోగదారుల హక్కులపై ప్రత్యేక శిక్షణ..
– నైపుణ్యం కలిగిన ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ తో 224 టీచర్ గైడ్స్ కు ప్రత్యేక శిక్షణ..
– అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ , జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: సెప్టెంబరు11:జిల్లాలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత చైతన్యవంతం చేసేందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవరం వినియోగదారుల క్లబ్ లో, వినియోగదారులను చైతన్యం పరిచే 9 రకాల పోస్టర్స్ ను జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ “విద్యార్థులకు వారి హక్కులు మరియు పరిష్కార విధానాల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన వినియోగదారులుగా వ్యవహరించేలా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్ ల ఏర్పాటు యొక్క లక్ష్యం ముఖ్యఉద్దేశ్యమన్నారు. విద్యార్థి దశ అనగా యుక్త వయస్సు నుండే మనస్సులను కదిలించడానికి మరియు వినియోగదారుల అవగాహనను వ్యాప్తి చేయడానికి ఏలూరు జిల్లాలోని 224 వినియోగదారుల క్లబ్ రోజూ సెమినార్లు, వర్క్ షాప్‌లు మరియు చర్చలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 224 వినియోగదారుల క్లబ్ లు స్కూల్ లో ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన 224 అధ్యాపకులు (టీచర్ గైడ్స్) మరియు విద్యార్థి ఆఫీస్ బేరర్లచే క్లబ్ నిర్వహించబడుతున్నాయన్నారు. అవగాహన కలిగిన వినియోగదారు ఏదైనా సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. వినియోగదారుల అవగాహన, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలను పెంపొందించే లక్ష్యంతో ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక మ్యాగజైన్ “మేము సైతం” మరియు 9 రకాల పోస్టర్లను విడుదల చేయడం జరిగిందన్నారు. ఆహార భద్రత, కల్తీని ఎదుర్కోవడం, భారతదేశంలో సైబర్ చట్టాలు, డిజిటల్ అక్షరాస్యత, కార్పొరేట్ సామాజిక బాధ్యత, తప్పుదోవ పట్టించే ప్రకటనలు వంటి వివిధ అంశాలపై క్లబ్ సెమినార్‌లను నిర్వహిస్తుందన్నారు. విశిష్ట విద్యావేత్తలు, న్యాయమూర్తులు మరియు వినియోగదారుల ఫోరమ్, వినియోగదారుల సంస్థలు మరియు పరిశ్రమ సభ్యులను కూడా ఆహ్వానించి, కన్స్యూమర్ క్లబ్‌లోని విద్యార్థులు వివిధ పాఠశాలల్లో ఔట్‌రీచ్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కన్స్యూమర్ క్లబ్ యొక్క విశిష్టతను తెలియచేయవచ్చునన్నారు. ఆగిరిపల్లి మండలంలో 5 వినియోగదారుల క్లబ్ లు, భీమడోలు 6, బుట్టాయిగూడెం 15 చాట్రాయి 7, చింతలపూడి10, దెందులూరు 8, ద్వారకాతిరుమల 4, ఏలూరు 22, జంగారెడ్డిగూడెం 10, జీలుగుమిల్లి 6, కైకలూరు 8 , కలిదిండి 9, కామవరపుకోట 5, కొయ్యలగూడెం 6, కుక్కునూరు 7 లింగపాలెం 6, మండవల్లి 7, ముదినేపల్లి 8, ముసునూరు 8 , నిడమర్రు 11, నూజివీడు 11, పెదపాడు 9 , పెదవేగి 12 , పోలవరం 6, టి .నరసాపురం 5 , ఉంగుటూరు 8, వేలేరుపాడు మండలంలో 5, వినియోగదారుల క్లబ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్ , ఏలూరు ఆర్డిఓ ఎస్.కె. ఖాజావలి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్.రాజు, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, డిఇఓ శ్యామ్ సుందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణమూర్తి, , తదితరులు పాల్గొన్నారు.