ఏపీలో కరోనా కర్ఫ్వూ పొడగింపు!
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్–19 కర్ఫ్వూ వేళలను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 31వ తేదీ తేదీ దాకా రాత్రివేళ 12గంటల నుంచి ఉదయం 5గంటల దాకా కరోనా కర్ఫ్వూ అమలులో ఉంటుందని పేర్కొంది. సదరు సమయాల్లో కర్ఫ్వూ నిబంధనలను ఉల్లంఘిస్తే పోపలీసులు యథావిధిగా కేసులు నమోదు చేస్తారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలో కరోనా ప్రాబల్యం తగ్గుముఖం పడుతోన్నక్రమంలో ప్రభుత్వం క్రమేణా కర్ఫ్వూ సమయాలను సడలిస్తూ వస్తోంది.