ఇంటర్న్‌షిప్‌తోపాటు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి… వీసీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్‌షిప్‌తోపాటు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. గతనెల 11, 20, 21 మరియు సెప్టెంబర్ 3వ తేదీల్లో వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ & ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఢీకోడింగ్ ల్యాబ్, గ్లోబల్ క్వెస్ట్ టెక్నాలజీస్, క్యూ స్పైడర్స్ మరియు విస్టాండ్4యు టెక్నాలజీస్ మొదలైన సంస్థలకు మొత్తం 48మంది విద్యార్థులు ఎంపిక కావడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతికపరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకురావడంకోసం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. విద్యార్థులకు మరిన్ని ఇంటర్న్‌షిప్ మరియు ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖసంస్థలతో సమన్వయంచేస్తూ కార్యక్రమాలను కొనసాగించాల్సిందిగా చాల్సిందిగా వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ సెల్ ఆధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయకుమార్ నాయుడు, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ, వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అధికారులు డాక్టర్ జి. సురేంద్ర మరియు ఎ. శ్రీకాంత్‌తోపాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


