NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో ఎన్‌సీసీ  సీఏటీసీ–1 శిబిరంలో ఘనంగా సాంస్కృతిక వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలులోని రిడ్జ్ స్కూల్‌లో 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ CATC–1 శిబిరంలో నిన్న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ శ్రీ జి. పుల్లయ్య  హాజరయ్యారు. కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి  కూడా పాల్గొని, కేడెట్ల ప్రతిభను మరియు క్రమశిక్షణను ప్రశంసించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎన్‌సీసీ ద్వారా నాయకత్వ లక్షణాలు, ఐక్యత, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలియజేశారు.ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కేడెట్లు వివిధ ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా క్యాంప్ కమాండెంట్  కల్లన్ జోబీ ఫిలిప్ ముఖ్య అతిథికి స్మారక చిహ్నం అందజేశారు.ఈ కార్యక్రమంలో రిడ్జ్ స్కూల్  సీఈఓ శ్రీ గోపినాథ్ గుడూరి  పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన కేడెట్లకు అతిథులు బహుమతులు అందజేశారు.మొత్తంగా ఈ సాంస్కృతిక వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

About Author