తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్లను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే
1 min read

సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
దశాబ్ద కాలం పైగా జాతర కమిటీ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తూర్పువీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఏలూరు తూర్పు వీధిలోని జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ ఇంటి వద్ద తూర్పువీధి శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల ఘటాలకు జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతి సమేతంగా పాల్గొని అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ శతాబ్ద కాలం పైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పువీధి గంగానమ్మ జాతరను అత్యంత వైభవోపేతంగా జాతర కమిటీ వారు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అమ్మవార్ల కరుణ కటాక్షాలు దెందులూరు నియోజకవర్గ మరియు ఏలూరు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈనెల 25వ తేదీన జరగనున్న మహాకుంభం కార్యక్రమంలో, అదేవిధంగా 26వ తేదీన చిత్ర విచిత్ర వేష ధారణలతో భారీ భక్త జన సందోహంతో జరగనున్న కొర్ల బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.


