శ్రావణమాసం చివరి వారంలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
1 min read

రామనపల్లిలో ఆంజనేయస్వామికి విశిష్ట పూజలు
చెన్నూరు, న్యూస్ నేడు: శ్రావణమాసం ఐదవ వారం చివరి శనివారం కావడంతో చెన్నూరు మండలంలో శ్రీ ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర స్వామి. శివాలయాల్లో తెల్లవారుజామున 6 గంటల నుంచి భక్తులు ఆలయాలను సందర్శించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయాల వద్ద భక్తులతో పోటెత్తారు. చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి కి ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు పూల అలంకరణ వేద పండితులచే నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. చెన్నూరు మండలం రామన పల్లె గ్రామంలో వలసిన శ్రీ ఆంజనేయ స్వామికి వేద పండితుల చేతుల మీదుగా అభిషేక పూజలు పూలు అలంకరణ నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలతో పాటు ముండ్లపల్లి ఓబులంపల్లి, రాచినాయపల్లి గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. చెన్నూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు స్వామి కి పూల అలంకరణ నిర్వహించారు. ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. చెన్నూరు ప్రధాన శివాలయాల్లో కూడా పూజలు జరిగాయి. బుడ్డాయిపల్లి కనపర్తి గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నూరు పెన్నా నది ఒడ్డున తెలిసిన పెన్నా ఆంజనేయ స్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాల్లో కీర్తనలు ఏర్పాటు చేశారు. చివరి వారంతో శ్రావణమాసం ఉత్సవాలు ముగిశాయి.


