‘ మెడికవర్ ‘ లో భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు
1 min read
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూల్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌లో శ్రీ సరస్వతి గణేష్ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా పూజా కార్యక్రమంలో భాగస్వాములను చేసి, వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, యాజమాన్య ప్రతినిధులు మరియు పేషెంట్లు పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఆధ్యాత్మికత, భక్తి భావం, సానుకూల వాతావరణం నెలకొంది.చికిత్స పొందుతున్న పేషెంట్లలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపడంతో పాటు, పండుగ సందర్భంగా వారిలో ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పేషెంట్లను కూడా ఈ పూజా కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్యులు, సిబ్బంది, యాజమాన్యం అందరూ కలిసి భక్తి భావంతో పూజల్లో పాల్గొనడం ద్వారా ఆసుపత్రి మొత్తం ఒక కుటుంబంలా కనిపించింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “మా పేషెంట్లతో కలిసి శ్రీ సరస్వతి గణేష్ పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పేషెంట్లకు వైద్య సేవలతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మీయత కూడా ఎంతో అవసరం. అందుకే వారిని ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములను చేశాం. పేషెంట్లు, వైద్యులు, సిబ్బంది, యాజమాన్యం అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా ఆసుపత్రిలో ఒక ఆహ్లాదకరమైన, సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.


