NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామస్థాయి సమస్యలపై టీడీపీ మండల సమావేశంలో చర్చ

1 min read

పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

మై టిడిపి యాప్‌లో హాజరు, తీర్మానాలు, ఫీడ్‌బ్యాక్ నమోదు

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హొళగుంద మండల టీడీపీ కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎల్‌ఎల్‌సీ అతిథి గృహంలో మండల యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రజా నాయకుడు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి, సొసైటీ వైస్ చైర్మన్ కోనేరు దుర్గయ్య, జిల్లా నాయకులు అబ్దుల్ సుమన్ అధ్యక్షత వహించారు.మండలంలోని వివిధ గ్రామ యూనిట్ స్థాయి సమావేశాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలు, అభిప్రాయాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా గుర్తించి సంబంధిత అంశాలపై చర్చించి ముందుకు తీసుకెళ్లే విధానంపై సమీక్షించారు.అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నాయకులు చర్చించారు. ఆయా పథకాల అమలు తీరును గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల హాజరును నమోదు చేయడంతో పాటు ఫీడ్‌బ్యాక్ ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేశారు. సమావేశంలో తీసుకున్న తీర్మానాలను మై టిడిపి  యాప్‌లో నమోదు చేసి, కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేశారు.ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కుడ్లూరు ఈరప్ప, కరూర్ హుస్సేన్ పీర్, బకాడ వీరేష్, ఐటీడీపీ హనుమంతు, జాకీర్, మళ్లీ, షాలిఅమన్, సాయి బేస్, పెద్దయ్యట వీరేష్, కొల్లప్ప, సినిమా మంగన్న, భాస్కర్ తదితరులతో పాటు క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, జిల్లా, మండల, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *