NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ:1.18 కోట్లకు పైగా వీఎస్ఎస్ లబ్ధిదారులకు వాటా నిధుల పంపిణీ

1 min read

ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు చిర్రి బాలరాజు

కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు

గ్రామానికి ఉపయోగపడే శాశ్వత ఆస్తులను సమకూర్చుకోవాలని సూచించన

జిల్లా అటవీ అధికారి పి.వి. సందీప్ రెడ్డి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్లో రూ.1.18 కోట్లకు పైగా వీఎస్ఎస్ లబ్ధిదారులకు వాటా నిధుల పంపిణీఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (హె చ్ ఓ యఫ్ యఫ్ ), మంగళగిరి మరియు రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉత్తర్వుల ప్రకారం ఏలూరు డివిజన్, రాజమండ్రి సర్కిల్ పరిధిలోని జంగారెడ్డిగూడెం రేంజ్లో యూకలిప్టస్ ప్లాంటేషన్లకు సంబంధించిన 50% వన సంరక్షణ సమితి (వి ఎస్ ఎస్) ఆదాయ వాటా నిధులను అర్హులైన సభ్యులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నిధుల చెక్కులను అందజేశారు.

పంపిణీ వివరాలు

కనకాపురం వీఎస్ఎస్: రూ. 46,16,231/-

వెలుగువారిగూడెం వీఎస్ఎస్: రూ. 42,62,265/-

జిల్లెళ్ళగూడెం వీఎస్ఎస్: రూ. 30,17,270/-

మొత్తం పంపిణీ మొత్తం: రూ. 1,18,95,766/-

అటవీ సంరక్షణలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, వారి శ్రమకు తగిన ప్రతిఫలంగా ఈ లబ్ధిని ప్రభుత్వం సమకూర్చిందని అధికారులు తెలిపారు.హాజరైన ప్రముఖులు, అధికారులు చిర్రి బాలరాజు, శాసనసభ్యులు, పోలవరం నియోజకవర్గం

 పి.వి. సందీప్ రెడ్డి, ఐ ఎస్ ఎఫ్, జిల్లా అటవీ అధికారి (డి ఎఫ్ఓ ), ఏలూరు

శ్రీ ఎ. వెంకట సుబ్బయ్య, సబ్-డిఎఫ్ఓ, జంగారెడ్డిగూడెం

శ్రీ వి. దుర్గా కుమార్ బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ ఓ), జంగారెడ్డిగూడెం

స్థానిక అటవీ శాఖ సిబ్బంది మరియు సంబంధిత వీఎస్ఎస్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు మాట్లాడుతూ, అటవీ సంపద సమాజానికి అత్యంత కీలకమైనదని, అడవులను నరికివేతకు గురికాకుండా, దొంగతనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. వీఎస్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు గ్రామానికి ఉపయోగపడే శాశ్వత ఆస్తులను సమకూర్చుకోవాలని సూచించారు.జిల్లా అటవీ అధికారి (డి ఎఫ్ఓ) శ్రీ పి.వి. సందీప్ రెడ్డి, IFS మాట్లాడుతూ, అటవీ శాఖ మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన కమిటీలకు నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఈ నిధులను కేవలం ఖర్చులకే పరిమితం చేయకుండా, స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (యఫ్ ఆర్ ఓ), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల సలహాలు తీసుకుంటూ సామూహిక ప్రయోజనాలు, భవిష్యత్ తరాల అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *