పేదలకు నిత్యావసర కిట్ల పంపిణీ…
1 min read
అల్ హసన ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేత..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: గ్రామాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి తమ వంతుగా ట్రస్ట్ నుండి పేదలకు అండగా నిలుస్తోంది అల్ హసన ఎడ్యుకేషనల్ మరియు వెల్ఫేర్ ట్రస్ట్..నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఉన్న ఈ ట్రస్ట్ కడుమూరు మరియు తదితర గ్రామాల పేద ప్రజలకు నిత్యావసర కిట్లను కమిటీ సభ్యులతో కలిసి ట్రస్ట్ ప్రెసిడెంట్ బి సులేమాన్,కార్యదర్శి జియావూర్ రెహమాన్ ఒక్కొక్కరికి 1200 రూపాయలు విలువచేసే కిట్లను బుధవారం పంపిణీ చేశారు.70 మందికి బియ్యం,ఆయిల్ కందిపప్పు,కారంపొడి, పసుపు,టీ పొడి,సబ్బులు తదితర వస్తువులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో తమ సంస్థ ఆధ్వర్యంలో గత 2020 సంవత్సరం నుండి కుల మతాలకు అతీతంగా పేదలకు ఇలాంటి సహకారం అందిస్తున్నామని అన్నారు. ఒక ఏడాదిలో నాలుగు, ఐదు సార్లు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పెద్ద శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వాహన సదుపాయం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ట్రస్ట్ కు తమ వంతుగా ప్రజలు సహకారం అందిస్తే ప్రజలకు మరింతగా సేవ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ అబ్దుల్ సలాం,సభ్యులు జబీఉల్లా,అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.


