NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలకు ఇన్వర్టర్..స్టడీ మెటీరియల్ పంపిణీ

1 min read

ఆల్కేమ్ కంపెనీ ఆధ్వర్యంలో 2 లక్షలతో వాటర్ ప్లాంట్..

 మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలో కలమందలపాడు జిల్లా పరిషత్ పాఠశాలకుఆల్కెమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ ద్వివేది మంచి మనసుతో స్పందించి విద్యార్థుల అభివృద్ధి కోసం పాఠశాలకు 60 వేలతో ఇన్వర్టర్ లేజర్ ప్రింటర్ డబల్ బ్యాటరీలను ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ కు మరియు హెచ్ఎం రమేష్ కు శుక్రవారం అందజేశారు.అదేవిధంగా మాసపేట,కడుమూరు (మెయిన్)ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ నోట్ బుక్స్,పలకలు,పెన్సిళ్లు తదితర స్టేషనరీ వస్తువులను విద్యార్థులకు అందజేశారు. తమ కంపెనీ నుండి విద్యార్థులను మరియు గ్రామాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతోనేకార్యక్రమాలు చేస్తున్నామని విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. మాసపేటలో 2 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించామని ఆయన అన్నారు.తర్వాత ఎంఈఓ కంపెనీ ప్రతినిధులను సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ యువరాజ్,సర్పంచ్ శంషున్ భీ,ఏరియా ఇన్చార్జి కే అరుణ్ కుమార్,వలి టొబాకో ట్రేడర్స్ వలిభాష,అబ్దుల్ సలాం,షఫీ,రఫీ,హెచ్ఎం అథియా బేగం,మల్లయ్య, బ్రహ్మయ్య మరియు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author