NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెండి ఆభరణాల దొంగలను పట్టుకోండి..

1 min read

పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిల

చాగలమర్రి రూరల్ న్యూస్​ (నేడు): చాగలమరి మండలంలోని మద్దూరు గ్రామంలో ఆలయంలో జరిగిన వెండి ఆభరణాల అపహరణ పై ఆరా తీస్తూ దొంగలను పట్టుకోవాలని ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ శుక్రవారం ఎస్సై సురేష్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే మద్దూరు గ్రామానికి వెళ్లి ఆలయంలో చోరీకి గురైన వెండి ఆపరణాలను దొంగతనం చేసిన వారిని త్వరగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రజలకు తెలియజేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 20 లక్షల రూపాయల భజన మందిరానికి మంజూరు కావడం జరిగిందని, అలాగే తన సొంత నిధులతో సంక్రాంతి లోపు ఆలయ ప్రాంగణంలో బండ పరుపు వేయిస్తానని హామీ ఇచ్చారు. ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయిస్తానని గ్రామస్తులకు తెలిపారు. ఆలయాల వద్ద గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవాలన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈమె వెంట టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహుడు, టిడిపి నాయకుడు సల్ల నాగరాజు యాదవ్, టిడిపి నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు ఉన్నారు.

About Author