ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే కోట్ల
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం ప్యాపిలి మండలం మేటుపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పింఛన్లు, విద్యుత్ సమస్యలు, ఆరోగ్య సేవలు తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే తన ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరావు యాదవ్, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, టీడీపీ నాయకులు సీమా సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ సుదర్శన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మార్వో భారతి, సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నాగార్జున, ఏడీ, ఏవో రాజేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, టీడీపీ పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, జనరల్ సెక్రటరీ నడిగడ్డ నాగేంద్ర, ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మధుకుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు, బీజేపీ నాయకులు కే.సీ. మద్దిలేటి, టీడీపీ నాయకులు ఏనుగుమర్రి రామకృష్ణ, రామ్ భూపాల్, శివశంకర్, కమతం భాస్కర్ రెడ్డి, చిన్న పూజార్ల రమేష్ గౌడ్, సప్తసైల సతీష్, ఆర్.సీ. మద్దిలేటి, సుంకన్న, సాంబతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



