NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తి మిల్లును సందర్శించిన జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు  : గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో ఉన్న పత్తి మిల్లును జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి సందర్శించారు.ఈ సందర్భంగా మిల్లులో జరుగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి కొనుగోలు చేస్తున్న పత్తి నాణ్యత, నిల్వ సదుపాయాలు, యంత్రాల పనితీరు, కార్మికుల భద్రతా చర్యలను పరిశీలించారు.. పత్తి ఉత్పత్తిదారులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిల్లు నిర్వాహకులను  ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పత్తి మిల్లు యాజమాన్యం మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

About Author