NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంధన అవసరాలుపై సంబంధిత అధికారులతో  జిల్లా కలెక్టరు  సమీక్ష

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్యసేవలు, ఏపీఎస్ ఆర్టీసీ, తదితర శాఖలు, ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన అవసరాలుపై సంబంధిత అధికారులతో  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. శాఖలు వారీగా ఇంధన అవసరాలను జిల్లా కలెక్టరు సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వైద్యసేవలు, వ్యవసాయఅనుబంధ శాఖలు, మరియు ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన కొరతలేదని స్పష్టం చేశారు. శాఖలు వారీగా ముందుగా కావలసిన ఇంధన ఇండెంటును సమర్పించాలని, సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు, రైతులకు అందిస్తున్న సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు ఎటువంటి ఇంధన కొరత లేదని, ఏలూరు, నూజివీడు ఏపీఎస్ ఆర్టీసీలో రెండు బంకులు ఉన్నాయని, నాలుగురోజులు వరకు నిల్వలు సరిపోతాయని మరలా ఆయిల్ కొరకు ఇండెంట్లు పెట్టామని అన్నారు.  ప్రతి ప్రభుత్వ అసుపత్రిలో ఒక విద్యుత్తు ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ ఒక్క రైతు డీజిల్ కొరకు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఐటిడిఏ పరిధిలో, పోలవరంలో ఇంధన కొరత రాకుండా  చూడాలని, గృహ నిర్మాణాల్లో ఇంధన కొరత రాకుండా నిర్మాణాలు జరగాలని అన్నారు. నిబంధన మేరకు టోకెన్లు జారీ చెయ్యాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో టోకెన్లు జారీ చేస్తే ఛార్జీ మెమోలు జారీ చెయ్యాలని అన్నారు. పట్టణ, గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకులు నిల్వలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని, అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ కంపెనీలకు ఇండెంట్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెట్రోల్ బంకులలో టోకెన్లకు మొదట ప్రాధాన్యతను ఇవ్వాలని, మిగతా వారికి నిబంధనలకు అనుగుణంగా ఇంధనాన్ని అందించాలని  జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి యల్.దేవకీదేవి,ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిశోరు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్,జిల్లా ప్రజా రవాణాధికారి యస్.కె.షబ్నమ్, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఉప రవాణా కమిషనరు యస్.కె.కరీం,జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డీఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా:యు.శోభ,డిసిహెచ్ఎస్ డా:బి.పాల్ సతీష్ కుమార్,జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి జి.సత్యనారాయణ,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా: గోవిందరాజులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *