జనసేన సభ్యత్వ కార్డులను డౌన్ లోడ్ చేసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): జనసేన పార్టీకి క్రియా శీల సభ్యత్వ నమోదు చేస్తున్నవారు సభ్యత్వ ఐడీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని నంద్యాల జిల్లా మిడుతూరు మండల జనసేన పార్టీ యువ నాయకులు గుడిపాడు ప్రభాకర్ సోమవారం అన్నారు. మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని మొబైల్లో ప్లే స్టోర్ లో జనసేన అస్త్ర అని టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని అప్పుడు ఓటిపి వస్తే ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాలి అస్త్ర యాప్ ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ లోకి వెళ్లి మెంబర్షిప్ మీద నొక్కి డౌన్లోడ్ మీద ఎంటర్ చేయాలన్నారు.మీ సెల్ లోనే డౌన్లోడ్ అవుతుందని ఇన్సూరెన్స్ మీద నొక్కాలి ఇన్సూరెన్స్ బాండ్ డౌన్లోడ్ చేసుకోవాలని జనసేన పార్టీ కార్యకర్తలకు గుడిపాడు ప్రభాకర్ సూచించారు.