NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడేళ్లు పూర్తి చేసుకున్న ఎం టి వి తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ 

1 min read

నేడు కోట్ల మంది ప్రజాదరణ పొందుతూ సామజిక సేవ కార్యక్రమలు

నగర ప్రముఖులతో మే 24నుండి 31వరకు మజ్జిగ పంపిణ

ఏలూరు,ప్రతినిధి,న్యూస్ నేడు: ఎoటివి తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ మూడేళ్లు పూర్తి చేసుకొని 4వ ఏడాదిలోకి పెట్టిన సందర్బంగా ఎo టి వి కోట్ల మంది ప్రజాదరణ పొందుతూ సామజిక సేవ అనే కార్యక్రమం యాజమాన్యం చేపట్టింది. మే 24నుండి నిరంతరంగా మే 31వరకు ఎండ తీవ్రతతో దాహర్తితో ఇబ్బందులు పడుతున్న బాటసారులకు ఏలూరు మోర్ రోడ్డులో నేడు 5వ రోజు  ఎo టివి చలివేంద్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాత్రికేయులు సమాజ సేవతో రాత్రనకా పగలనకా శ్రమిస్తూ శ్రమిస్తుంటారని, కొంత సమయాన్ని కేటాయించి సామాజిక సేవలో కూడా పాలు పంచుకోవడం అభినందనీయనికొనియాడారు.  ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సినిమా నిర్మాత అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ , ప్రముఖ పారిశ్రామికవేత్త ఏలూరు అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కె కె గుప్తా, ప్రధాన కార్యదర్శి మద్దుల రవికుమార్, ఎపిఎన్ జిజి ఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు,జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హరనాధ్, ప్రధాన కార్యదర్శి నెరుసు రామారావు, జనసేన జిల్లా సెక్రటరీ తేజస్విని,రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణి, ఏలూరు నగర జనసేన అధ్యక్షులు వీరంకి పండు, జనసేన పార్టీ నాయకులు గౌరి,కుబేర హోటల్ పార్టనర్ చలువది పవన్,సోషల్ సర్వీస్ మురళి, పలువురు జనసేన పార్టీ నాయకులు,మాజీ కార్పొరేటర్ పునుకొల్లు పార్ధసారధి కుటుంబ సభ్యులు మరియు ఎంటివి యూనిట్ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేసారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *