విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి
1 min read
విఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె..
మిడుతూరు న్యూస్ నేడు: గ్రామ రెవెన్యూ సహాయకులకు(వీఆర్ఏ) వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు వెంకటరమణ,వైస్ ప్రెసిడెంట్ భూషన్న ఆధ్వర్యంలో గురువారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదు.అదేవిధంగా వీఆర్ఏలకు విఆర్ఓ ప్రమోషన్లు కూడా ఇవ్వలేదు.
విఆర్ఏల ప్రధాన డిమాండ్లు
విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి,నామినీలను వీఆర్ఏ నియమించాలి,
జీవో No.402 ను రద్దుచేసి అర్హులైన వీఆర్ఏలకు వాచ్ మెన్,అటెండర్,డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలి.మరణించిన వీఆర్ఏల స్థానంలో వీఆర్ఏలుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు.చాలీ చాలని జీతాలతో పిల్లల చదువులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్ పరిష్కరించాలని లేనియెడల రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.తర్వాత తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలుఎల్లప్ప,కొండల్, శ్రీనివాసులు,తిరుపాలు,హసీనా తదితరులు పాల్గొన్నారు.


