NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలి

1 min read

ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు ఏపీవీబీఎస్ నాయకుల వినతిపత్రం

హోళగుందన్యూస్ నేడు: ఆస్పరి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను ఆలూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏపీవీబీఎస్ (ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సేవా సంఘం) నాయకులు కలిసి వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏపీవీబీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ, వాల్మీకి/బోయల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యంత అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసి ఈ డిమాండ్ నెరవేర్చాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందిస్తూ, వాల్మీకి/బోయల డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీవీబీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్, ఎల్లార్తి తిమ్మప్ప, సుళువోయి సురేష్, అంజి తదితర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

About Author