NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల లో ఆంగ్ల భాషా దినోత్సవం

1 min read

 ఇంగ్లీష్ కేవలం పరీక్షల కోసం కాదు,ప్రపంచానికి తలుపులు తెరిచే జీవన నైపుణ్యం

కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర్లు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విలియం షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకొని, ఆదిత్య డిగ్రీ కళాశాల, సాత్రంపాడులో ఏప్రిల్ 23న ఆంగ్ల భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆంగ్ల భాష యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను,అది కలిపే, వ్యక్తీకరించే,సృష్టించే శక్తిని తెలియజేసింది.కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ   “భాష ఆలోచనకు వస్త్రం వంటిది. ఆంగ్ల భాషా దినోత్సవం సందర్భంగా,షేక్స్పియర్ ఆంగ్లానికి అందించిన అమూల్యమైన కానుకను స్మరించుకుంటూ,ప్రతి విద్యార్థి మరింత చదవాలని, బాగా రాయాలని,ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలని కోరుతున్నాను. ఇంగ్లీష్ కేవలం పరీక్షల కోసం కాదు-ప్రపంచానికి తలుపులు తెరిచే జీవన నైపుణ్యం అని ఉపన్యాసించారు.

ఇంగ్లీష్ విభాగాధిపతి మాట్లాడుతూ

ఏప్రిల్ 23 మనకు గుర్తుచేస్తుంది, పదాలు సామ్రాజ్యాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. షేక్స్పియర్-టు బీ ఆర్ నాట్ టు బీ-నుండి నేడు మనం మాట్లాడే ఇంగ్లీష్ వరకు,భాష దానిని వాడేవారి ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందలన్నరు.కాబట్టి చదవడం,రాయడం, మాట్లాడటం కొనసాగించండన్నరు.’విలియం షేక్స్పియర్’అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే’నేటి ప్రపంచంలో మౌఖిక ఆంగ్ల ప్రాముఖ్యత’అనే అంశంపై వక్తృత్వ పోటీ ఫలితాలు ప్రకటించారు.విద్యార్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటామని,ఆంగ్ల భాష సౌందర్యాన్ని ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేయడంతో కార్యక్రమం ముగిసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *