సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడుకి ఉంది
1 min read

ప్రతి పౌరుడు ఆర్టీఐ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సిపివో సి.హెచ్. వాసుదేవరావు పిలుపు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా అర్ధ గణాంక శాఖ ఆధ్వర్యంలో గురువారం అప్పిలేటు అధికారి సి.హెచ్.వాసుదేవ రావు,పౌర సమాచార అధికారి బి.శ్రీదేవి నేతృత్వంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. సమాచార హక్కుచట్టం గురించి తెలుసుకోవడం మీ హక్కు చెప్పడం ప్రభుత్వ భాధ్యత అనే నినాదంతో ఏలూరు శాఖ కార్యాలయం నుండి మోర్ సూపర్ మార్కెటు, జడ్పీ కార్యాలయం మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రజలకు ఆర్టీఐ వారోత్సవాలు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అర్థ గణాంక అప్పీలేటు అధికారి సి.హెచ్. వాసుదేవ రావు, పిఆర్ వో బి.శ్రీదేవి మాట్లాడుతూ ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించి, ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, అధికారులు జవాబుదారీతనాన్ని పెంచడం అవినీతిని నిర్మూలించడం ఈ చట్టం యొక్క ముఖ్యఉద్దేశ్యమని అన్నారు. సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడుకి ఈ చట్టం హక్కు కల్పిస్తుందని అన్నారు. సమాచార హక్కు చట్టం పౌరుల సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో ఉప గణాంక అధికారులు, సహాయక గణాంక అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది, విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బంది, ఏడబ్ల్యూయస్ సిబ్బంది, డేటా ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

