పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి
1 min read
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత-మన భవిష్యత్తు
సందేశం పోస్టర్లు,జ్యూట్ క్లాత్ బ్యాగులు ఆవిష్కరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతను నిర్వర్తించి భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్రు కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ వారోత్సవాలు సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం “పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత-మన భవిష్యత్తు” అనే సందేశంతో రూపొందించిన పోస్టర్లు మరియు జ్యూట్, క్లాత్ బ్యాగులను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణానికి హానీ కలిగించే పనిని ఏ ఒక్కరూ చేపట్టవద్దన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్, క్యారీ బ్యాగులను వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ యల్.దేవకీదేవి,ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న ,కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇఇ ఏ.రామచంద్రమూర్తి, సహాయక పర్యావరణ ఇంజినీర్లు కె.సంధ్య, యస్.రమేష్ , ఇతర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


