బాబు షూరిటీ,మోసం గ్యారంటీ “వెన్నుపోటి కి రెండేళ్లు” కార్యక్రమం
1 min read
15వ డివిజన్ లో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ మామిళ్ళ పల్లి జయప్రకాష్ (జెపి)అన్న పిలుపు మేరకు వంగయగూడెం 15వ డివిజన్ లో శనివారం జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ “వెన్నుపోటి కి రెండేళ్లు” కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తంగెళ్ల రాము,డివిజన్ నాయకులు సొంగ మధుసుదన్ (మధు) మరియు పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.కూటమి పాలక ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందని స్థానిక ప్రజలకు తెలియజేశారు.


